జనసేన నుండి వైసీపీలో చేరికల ప్రచారం అవాస్తవం: అనంతరాజుపేట జనసేన

రైల్వేకోడూరు, అనంతరాజుపేట గ్రామంలో అనంతరాజుపేట గ్రామపంచాయతీకి చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన బండారు మల్లి వైసిపి వ్యక్తి అనంతరాజుపేట గ్రామంలోని జనసేన నాయకులు వైసిపిలో 60 కుటుంబాలు చేరాయి అని చెప్పి తప్పుడు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించడం జరిగింది. అనంతరాజుపేట గ్రామానికి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో వైసీపీ నాయకుడు మల్లి కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు తనకు తానే వైసిపి కండువాలు కప్పి మరియు ఊరి సభ్యులకు ఎంపీ వస్తున్నారు రండి అని చెప్పి అందరికీ వైసిపి కండువాలు కప్పాడు. ఇలా 60 కుటుంబాలు వైసీపీలో చేరాయని ఎంపీ ముందు మెహర్బానీ పొందడానికి ఎమ్మెల్యే మన్ననలు పొందడానికి ఇలా చేశాడు. ఊరిలోని సభ్యులందరూ అసలు విషయం తర్వాత తెలుసుకొని విస్మయానికి గురయ్యారు. జనసేన అభిమానులుగా ఉన్న మాకు ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరొకసారి ఇలాంటి చేష్టలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన టిడిపి వేదిక ఘాటుగా ప్రెస్ మీట్ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, ముద్దపోలు రామసుబ్బయ్య, గిద్దలూరు భాను ప్రకాష్, వీర మహిళ శింగిరి శివమ్మ, సింగిరి రాజ్ కుమార్, గిద్దలూరు శివ, బండారు దుర్గ ప్రసాద్, సింగిరి మహేష్, డేగల మహేష్, మర్రి సన్నీ, మద్దిశెట్టి పెద్దన్న, సింగిరి వెంకటేష్, మర్రి వెంకటేష్ తెలుగు దేశం నాయకులు కొర్లకుంట శంకరయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.