జంఝావతి ప్రాజెక్టును సందర్శించిన జనసేన నాయకులు

పార్వతీపురం, మన్యం జిల్లా జనసేన పార్టీ పార్వతీపురంలో ఆదివారం
జనసేన నాయకులు గొర్లి చంటీ, రాజన్న రాంబాబు రైతు బాలు, వంశీ, కుమిలి నిఖిల్, సనపతి నరేష్, నరేష్ మిగిలిన జనసైనికులు జంజావతి ప్రాజెక్ట్ కుడికాలువను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసియాలో మొదటిది అయిన ప్రాజెక్ట్ నిర్మాణం నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర మన్యం జిల్లా రైతులకు సస్యశ్యామలంగా ఉండే బహుళార్థ సాధక ప్రాజెక్టు అయినటువంటి ఈ జంఝవతి ప్రాజెక్ట్ సాగునీటి ప్రాజెక్టులో కుడి కాలువ ద్వారా సాగునీరు 24 వేల ఎకరాలకు అనుకున్న అంచనా ప్రకారం మన్యం జిల్లా పార్వతీపురం వ్యవసాయ రైతులకు ఏర్పాటు ఉద్దేశంతో 2006లో స్వర్గస్తులు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. కానీ ఆ నిర్మాణం పూర్తిగా కాకుండా ఓడిసా, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు యొక్క సమస్యలు ముంపు గ్రామాలకు పునరావాసం కేటాయించె విధంగా హామీ అమలు రెండు రాష్ట్రాలు చొరవ తగ్గడం వల్ల విభేదాలను వలన కుడి కాలువ సమస్య పూర్తి కాల యాపన వల్ల ప్రోజెక్ట్ నేటికీ పూర్తి కాలేని పక్షంలో నాలుగు దశాబ్దాలుగా పార్వతిపురం కొమరాడ మండలం, సీతానగరం మండలాలకు ఈ కుడి కాలువపై ఆధారపడినటువంటి వ్యవసాయ రైతులు నేటికీ నీర కాలువ ద్వారా వస్తుందని ఎంతో ఆశతో చూస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఈ కుడికాలువ సమస్యను పరిష్కారం చూపే ఆలోచనా విధానమే లేదు. ఎందుకు అనగా ప్రస్తుత రుతుపవనాలు సరైన సమయానికి సమయాను కూలంగా వర్షాలు కురిసే అవకాశం లెని కారణంగా, ఓక ఆశా కిరణంగా జంఝావతి కాలువ ద్వారా అయినా రైతులకు లబ్ది చేకూరెందుకు అవకాశం ఉంది. అని ఎదురు చూస్తున్న రైతాంగం జనసేన పార్టీ నాయకుల వద్దకు సమస్యను తీసుకోని రావడం జరిగింది. సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల వర్షాధార పంటలైన వరి సాగు సగంలో పంట నీటి ఎద్దడి కోసం భూమి పీఠాభూమిగా మారిపోయే దుస్థితి ఏర్పడినందున ఇటువంటి సందర్భాల్లో ఈ కుడి కాలువ యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరం ఉందని తెలియజేస్తూ, ఆదివారం ఈ కుడికాలువను సందర్శించి ఈ కుడికాలు యొక్క ప్రాముఖ్యతను జనసేన పార్టీ ద్వారా రైతులకు న్యాయం జరిగేలా తెలియజేయాలని, రైతులకు ఎంతో కొంత 24 వేల ఎకరాలకు కాకపోయినా 12000 ఎకరాల కైనా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బడ్జెట్ నిధులను ఈ నాలుగేళ్లలో కేటాయించకపోవడం చాలా దౌర్భాగ్యుమని చెప్పుకోవచ్చు పాలకులారా ఎన్నికలు వస్తున్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పార్వతీపురంలో పోటీ చేసినటువంటి ఈ నాయకులు చిత్తశుద్ధి ఈ కుడి కాలువ పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుందని తెలియజేస్తూ, తప్పనిసరిగా ప్రజలకు మరియు రైతాంగం పడుతున్న ఇబ్బందులు ద్రృష్ట్యా మీకోసం మెం పోరాడాటానికి అండగా నిలపడతాం అని, జనసేన పార్టీ ఈ సమస్యపై గళం వినిపిస్తుంది. ఈ సమస్యపై పోరాడుతుంది ఈ సమస్య సాధించేంతవరకు రైతు సంఘాలతో జనసేన పార్టీ గట్టిగా నిలబడుతుందని తెలియజేస్తూ ఈ కుడికాలు సాగు నీరు సదుపాయం కల్పించేంత వరకు నిలబడి పోరాటం చేస్తామని రైతు పక్షాన నిలబడతామని మరి ఈ మన్యం జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి అండగా భరోసాగా ఉంటామని జనసేన నాయకులు తెలిపారు.