జనసేన భీమ్ యాత్ర 10వ రోజు

కాకినాడ సిటి: జనసేన భీమ్ యాత్ర 10వ రోజు కార్యక్రమం బుధవారం జనసేన పార్టీ 21వ డివిజన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జరిగినది. ఈ కార్యక్రమంలో బండి సుజాత ప్రజలను చైతన్యపరుస్తూ దళితులు, బడుగులపై దౌర్జన్యాలు, అణిచివేతలు హత్యలు రాష్ట్రంలో నిత్యం జరుగుతుంటే వాటిని అణచివేసేందుకు ఈ వై.సి.పి ప్రభుత్వానికి మనసు ఎందుకు రావడంలేదని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆలోచించాలన్నారు. కనీసం నిందితులపై చర్యలు ఉపక్రమించకపోయిన విషయం కాసేపు పక్కనపెట్టి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్క ముక్క తన విచారాన్ని వ్యక్తం చేయకపోడం చూస్తే దళితులపై ఈ ముఖ్యమంత్రికి ఎంత చులకన ధోరణో అర్ధం అవుతోందన్నారు. ఊడిగం చేసే రోజులు పోయాయనీ దళితులలో వచ్చిన చైతన్యం రాబోయే ఎన్నికలలో రుచి చూస్తారన్నారు. జనసేన పార్టీ దళితుల తరపున పోరాటాలకి ముందుంటుందని చెప్పారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, సయ్యద్ మొయీన్, చీకట్ల వాసు, వీరమహిళలు బట్టు లీల, బండి సుజాత, దీప్తి, సోనీ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు.