అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తే దూషించడం సబబు కాదు

  • పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంటుంది జివి ప్రసాద్

నెల్లూరు: అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తే, సమస్యల గురించి పోరాటం చేస్తున్న మా నాయకులు గునుకుల కిషోర్ అన్న గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం సబబు కాదంటూ నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ సుబేదారు పేట నందు గల గునుకుల కిషోర్ గారి పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలప్పుడు 12వ డివిజన్లో అభ్యర్థిని విత్ డ్రా చేయించినప్పుడు మీరు చేసిన హడావుడి, మీకు ముట్టిన డబ్బులు గురించి నెల్లూరు ప్రజలందరికి తెలుసు. మీరు బెదిరింపులకు పాల్పడుతూ, మిగతా అందరూ కూడా అలానే ఉంటారనుకోవడం పొరపాటే.. రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేసిన ఎందరో కాంట్రాక్టర్లకు, ఈ ప్రభత్వం డబ్బులు చెల్లించలేకపోతున్న నేపథ్యంలో వారు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో కేవలం మీరు చేసిన పనులకు మాత్రమే నిధులు ప్రభుత్వం నుండి ఎలా వస్తున్నాయో తెలుపగలరు. నెల్లూరు రూరల్ లోని గ్రామాల సంగతి విదితమే, విలీన గ్రామాలైనటువంటి అల్లీపురం, ఆమంచర్ల, వైయస్సార్ నగర్, శ్రామిక నగర్, అల్లిపురంలో తాగేందుకు నీరు, రోడ్లు, కాలవలు లేక స్థానిక ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీటికి మీ సమాధానం ఏమిటి? వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూపించేందుకు నేను సిద్ధం చూసేందుకు మీరు సిద్ధమా..? మా నాయకుడు కిషోర్ అన్న ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు మీరు నిరూపించగలరా..? మీరు నిరూపిస్తే మా నాయకుడు కిషోర్ అన్న రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమే. ప్రజా సమస్యల గురించి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా గానీ, వ్యక్తిగతంగా వాళ్ళ పైన పడి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మీకు మామూలే. పెళ్లిళ్లు, కాపురాలు లాంటి విషయాలు మా వ్యక్తిగతం, కానీ రాజకీయ నాయకులుగా ఉండే మీరు పలమార్లు రాజకీయ పార్టీలు మారడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతారు. కనీసం జిల్లా కార్యాలయంలో గాని, నెల్లూరు రూరల్లో పోటీ చేసే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో గానీ ప్రెస్ మీట్ నిర్వహించలేకున్నారు. అది మీ స్థాయి ఈ రోజున జిల్లాలో ఎన్నో సమస్యల పైన నిలబడి, పోరాడిన కిషోర్ అన్న స్థాయి ఏంటి అనేది నెల్లూరు ప్రజలకు తెలుసు. మా నాయకుడు ఎంతో గౌరవంగా అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే , విచక్షణ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇది సబబు కాదు. మీరు చెప్పినట్టుగానే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత, స్థాయి మీకు లేవు. ఆయనకు ఇచ్చిన ధైర్యంతో గ్రామాలలో నిండా 20సం.లు కూడా నిండని యువత మా గ్రామానికి నీరు ఎక్కడ, రోడ్లు ఎక్కడ, మౌలిక సదుపాయాలు ఎక్కడ అంటూ రోడ్ల పైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. సామాన్యుడి హక్కుల కోసం పోరాటం చేస్తున్న జనసేన పార్టీ రానున్న రోజుల్లో ప్రజాధరణ పొందడం ఖాయం. నీలాంటి మూర్ఖులకు కనువిప్పు కలగడం ఖాయం అని ప్రశాంత్ గౌడ్ పేర్కొన్నారు.