తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుంది: మాయ రమేష్

తెలంగాణ, మంథని పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్ మాయ రమేష్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందని, మేడిగడ్డలోని కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం అని తెలియజేశారు. జనసేన పార్టీ మంథని నియోజకవర్గం ఇంచార్జ్ మాయ రమేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా విఫలమైందని, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం ద్వారా లక్షల కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోసిన పన్నీరు అయిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం సంపాదించిన ఆస్తులను జాతీయం చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ కుటుంబాన్ని, కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను జైలుకు పంపాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగాం పవన్, శేష జ్వాల రాజేష్, మెరుగు సునీల్, అనుమల వినయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.