దళితులకు ఈ 4 ఏళ్లలో ఏం చేశారో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి

ఉన్నమట్ల ప్రేమ్ కుమార్

పాలకొల్లు:

దళితుల ఓట్లతో కుర్చీ ఎక్కిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ నాలుగేళ్లలో దళితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం ప్రేమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ లను పెడితే ప్రజలకు ఒరిగిందేమిటి? కనీసం ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మీ జెండా పట్టుకున్న కార్యకర్తలకైనా ఇచ్చారా? సబ్సిడీ లోన్లు ఏమయ్యాయి? 27 ఎస్సీ పధకాలు ఎందుకు తీసేసారు? బాక్ లాగ్ పోస్ట్ ల సంగతేమిటి? ఎం. బి. బి. స్ సీట్ల విషయంలో రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన తొలగించారు? ఎస్సీ లు డాక్టర్లు అవ్వకూడదా? అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన ఆ మహానుబావుడు పేరు తీసేసి మీ పేరు పెట్టుకున్నారు మెల్లగా దానికి గండి కొట్టారు ఎస్సీలు విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదువుకోకూడదా?. ఎస్సీలను మభ్యపెట్టి ఎస్సీలకు వినియోగించాల్సిన సొమ్మును మీ సొంత పధకాలకు దారి మల్లించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు. మీ పాలనలో దళితులపై హత్యలు ఎందుకు పెరిగాయి? దళితులను చంపిన నిందితులను మీతో పాటు తిప్పుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు.
ఇన్ని రకాలుగా మా దళిత సమాజాన్ని మోషం చేసి మళ్ళీ ఎలా బస్సు యాత్రలు చేస్తారు. వెంటనే దళితులకు జరుగుతున్న ఈ అన్యాయాలన్నిటిపై సమాధానం చెప్పాలి. ఎస్సీ నిధులు ఎలా ఖర్చుచేశారు అనేది శ్వేతపత్రం విడుదల చేయాలనిప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.