అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన ఆర్కే వారియర్స్

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుడివాడ పట్నానికి చెందిన ఆవుల శిరీష అనే మహిళకు తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి తెలియజేయగా వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ జనసేన నాయకులు మరియు సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ (ఆర్.కె) మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే చిరంజీవి గారి పిలుపు మేరకు గుడివాడ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనేకసార్లు రక్తదానం చేసి ప్రజలకు తోడుగా ఉంటున్నామని ఈరోజు గుడివాడ పట్టణ ముబారక్ సెంటర్కు చెందిన ఆవుల శిరీష గర్భిణీ స్త్రీ కి అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే రక్తదానం చేసి ఆ తల్లి ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చాలామంది యువత రక్తం ఇవ్వాలంటే లేనిపోని అపోహాలు మనసులో పెట్టుకుని రక్తం ఇవ్వడానికి ముందుకు రావట్లేదని అవేమీ మనసులో పెట్టుకోకుండా ఇప్పటివరకు దగ్గర దగ్గర 53 సార్లు రక్తదానం చేసి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నానని తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారని. దయచేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మేము అడిగిన వెంటనే స్పందించిన మా తమ్ముడు కటారి వరుణ్ కుమార్ కి మా ఆర్కే వారియర్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నూనె అయ్యప్ప, మట్ట జగదీష్, ప్రభు, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.