చంద్రబాబు విడుదల సందర్బంగా వింజమూరులో సంబరాలు

ఉదయగిరి: వింజమూరు మండలంలో మంగళవారం చంద్రబాబు నాయుడు విడుదల సందర్బంగా జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో వింజమూరు పాత బస్టాండ్, బంగ్లా సెంటర్ నందు బాణాసంచాలు పేల్చి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రఘునందన్ రెడ్డి, మండల పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎస్.కే సుభాని భాయ్, జనసేన ప్రధాన కార్యదర్శి ఎస్.కే ఇమ్రాన్ జనసేన నాయకులు భరత్ కిషోర్, హేమంత్ తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.