కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు స్పోర్ట్స్ వేర్ పంపిణీ

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, ఉప్పలగుప్తం మండలం, మునిపల్లి ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్పోర్ట్స్ వేర్ (ఆట దుస్తులు) ను పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మెన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు(ఎన్ఆర్ఐ) సౌజన్యంతో కొవ్వలి ఫౌండేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిమ్మకాయల గోపాలరావు శ్రీమతి నీలిమల చేతుల మీదుగా 30 మంది విద్యార్థిని, విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కొవ్వలి ఫౌండేషన్ వాలంటీర్స్ పాల్గొని కొవ్వలి ఫౌండేషన్ చే నిర్వహించబడుతున్న సహాయక కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు.