సచివాలయ సిబ్బందికి కళ్ళు మూసుకుపోయయా?

  • జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష

విజయవాడ: రోడ్డు పక్కన ప్రైవేటు స్థలాలలో జనసేన పార్టీ విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేసిన బ్యానర్లు, పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే సందర్భంగా కట్టిన బ్యానర్లు కట్టిన గంటలో వచ్చి తీసేసే మీరు రోడ్డుకి నడి మధ్యలో కట్టన బ్యానర్లు కనబడట్లేదా? అని టౌన్ ప్లానింగ్ అధికారులను, సచివాలయ సిబ్బందిని జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ప్రశ్నించారు. ఆదివారం మీడియా ముఖంగా అనూష మాట్లాడుతూ.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారా మీరంతా? మీ మీ ఉద్యోగాలు మానేసి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వండి బ్యానర్లు కూడా దగ్గరుండి కట్టేస్తున్నారు కదా మీరే? స్వాతి రోడ్డుకి అన్ని వైపులా రోడ్లు మూసేసి స్థానిక ప్రజలను ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా స్థానికుల షాపులు కట్టేపించి మీరు ఏమి అభివృద్ధి చేశారని ఈ ఆర్భాటాలు? ఇంత అధికార దుర్వినియోగమా? లేకపోతే అధికారం మదమా? మీ అందరికీ, అదేవిధంగా వైసీపీ పార్టీ వాళ్లకి తగిన గుణపాఠం ప్రజలు త్వరలోనే చెప్తారు.