క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఆత్మకూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచన మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలోసోమవారం సంఘం మండలంలోని క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వాళ్లందరికీ క్రియాశీలక సభ్యత్వాల కిట్లను జనసేన పార్టీ సంఘం మండల జనసేన పార్టీ నాయకులతో కలిసి క్రియాశీలక సభ్యత్వాల కిట్లను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మావిళ్ళ ఆనందరావు, అత్తిపాటి కృష్ణమోహన్, మద్దెల హేమసాగర్, గంటసాల తిరుమలేష్, నెల్లూరు వెంకటేశ్వర్లు, ఆకులేటి సాయిచంద్, బాలు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.