రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి ఏమిటి..?: వీరమహిళ రియా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల గురించి జనసేన వీరమహిళ రియా మాట్లాడుతూ అసలు రెసిడెన్షియల్స్ లో ఉండాల్సిన ప్రాధమిక సౌకర్యాలు ఏమిటంటే బెడ్, లైట్స్, బాత్రూమ్స్, బెడ్ షీట్స్, ఫుడ్ ఇవన్నీ ఉండాలి. ఈ రెసిడెన్షియల్స్ లో 400 మంది ఉన్నారు. వీళ్ళకి ఈ రెసిడెన్షియల్ లో బెడ్స్ లేక నేల మీద పడుకుంటున్నారు కొన్ని గదిలో ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు తాగడానికి నీరు కూడా సరిగ్గా లేవు ఇంకా వాష్రూమ్స్ దగ్గరికి వస్తే అక్కడున్న విద్యార్థినిలు స్నానం చేసే గదులు ఎలా ఉన్నాయి అంటే డోర్లు కూడా లేవు. ఇంకా విద్యార్థుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఇంకా బయట స్నానాలు చేస్తున్నారు. ఈ రెసిడెన్షియల్ భవనం ఎలా ఉందంటే పెచ్చులు ఊడిపోయి ఏ టైం లో ఈ బిల్డింగ్ కూలిపోతాదా అన్నట్టుగా ఈ భవనం కూడా ఉంది. ఇది చూస్తుంటే బహుశా పాఠశాల నిర్వహణ హాస్టల్ విద్యార్థుల జీవన స్థితిగతులను మెరుగుపరిచే విధంగా వినియోగించాల్సిన నిధులు వీళ్ళు ఉపయోగించకుండా ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అర్థమవుతుంది. మరి వీళ్ళు, ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ నాయకులు దేనిమీద పనిచేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం పని చేస్తున్నారు ఎవరి కోసం పని చేస్తున్నారు ? రెసిడెన్షియల్ లో కనీస సదుపాయాలు కూడా అందించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు పాఠశాలల కోసం కేటాయించిన నిధులని ఏం చేస్తున్నారు ? ఆడవాళ్ళకి స్నానాలు చేయడానికి కూడా గదులు సరిగ్గా లేవు అంటే కూడా ఈ నాలుగు సంవత్సరాలనుంచి ఏం డెవలప్మెంట్ ఇచ్చారు. గురుకుల పాఠశాలలాంటి స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి నాడు-నేడు అని చెప్పి పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకుంటూ ఉంటారు. మరి స్కూళ్ల పరిస్థితులు ఏంటి ఏం డెవలప్మెంట్ చేశారు. ఇది చూస్తుంటేనే అర్థం అవుతుంది. మీరు అసలు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయించలేదు స్కూల్ కి అని. ఒకటో, రెండో, మూడో సరిచేస్తే సరిపోదు 100వది కూడా చేయాలి అర్థం అయ్యిందా..? ఒక సామాన్యుడు కోర్టులో పిల్ వేస్తే హైకోర్టు విచారణ జరిపిస్తే అప్పుడు ఈ దారుణాలు వెలుగు చూశాయి. అంటే ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి ఏమిటి..? బయటకు ఎవరు చెపుతారు. పిల్లలు చెప్పలేరు భయపడి. ఇక వారి మీడియాలో ఎప్పటికీ రావు. వేరే మీడియా వెళితే వాళ్ళని రానీయరు. ఇక వాస్తవాలు ఎలా ప్రజలకి తెలిసేది. ప్రభుత్వం దగ్గర పిల్లలకి బెడ్షీట్స్ కొనలేరు. జీతాలు ఇవ్వలేరు. చిన్న చిన్న రోడ్లు వేయలేరు. పరిశ్రమలు తీసుకురాలేరు. కానీ ముఖ్యమంత్రి సభకి కోట్ల ప్రజాధనం వృధా చేసి మా అధినేత పెళ్లిళ్ల గురించి మాట్లాడతారు. ఏంది ఇది జగన్ రెడ్డి.. ? సిగ్గు రాదా..? ఇక చాలు, నిన్ను భరించలేము మేము. ప్రజలారా అలోచించండి. ఈ ప్రభుత్వాన్ని త్వరగా ఇంటికి లేదా జైలుకు పంపిద్దామని అన్నారు.