తాండూర్ లో గెలిచి అధినేతకు బహుమానంగా ఇస్తా: నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూర్ నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ నా కష్టాన్ని గుర్తించి, నా కోసం ఇంతగా ఆలోచించి, నా పై నమ్మకం ఉంచి తాండూర్ శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని తాండూర్ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది బహుమానంగా ఇస్తానని తెలియజేస్తున్నానని అన్నారు.