మల్లవోలు గ్రామంలో మూడవ రోజు ప్రజా చైతన్య యాత్ర

గురజాల నియోజకవర్గంలో జనసేనపార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 3వ రోజు మాచవరం మండల అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మల్లవోలు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముందుగా మల్లవోలు కార్యాలయంలో కార్యవర్గ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకులు. గ్రామంలోని పెద్దలను, యువతను కలిసి రైతు సమస్యల గురించి చర్చించి దీనిపై సమిష్టి పోరాటం చేద్దామని తీర్మానించిన జనసేన నేతలు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై కూలంకుషంగా చర్చించిన జనసేన నేతలు. ఈ కార్యక్రమంలో అతిధులుగా జిల్లా కార్యదర్శిలు బడిదెల శ్రీనివాసరావు, గురజాల నియోజవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ మునగ వెంకట్, అంబటి మల్లి, మండల అధ్యక్షులు మందపాటి దుర్గారావు, కామిశెట్టి రమేష్, ఉప్పిడి నరసింహారావు, గురజాల వార్డు కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్, జనసేన నాయకులు నార్ల అశోక్, రమేష్, బేతంచర్ల అప్పారావు, గురజాల గంగాధర్, యుగంధర్, కామిశెట్టి నరసింహారావు, బేతంచర్ల ప్రసాద్, గుర్రం కొటేశ్వరవు, సూరం పరమేష్, దీకొండ కిరణ్, ముక్కంటి, మొగిలి కృష్ణ, కట్టెకోట నవీన్ తదితరులు పాల్గొన్నారు.