కుత్బుల్లాపూర్ జనసేన-బిజెపి అభ్యర్ధి కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్

తెలంగాణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కూన శ్రీశైలం గౌడ్ శుకరవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని, మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ అభ్యర్ధి నందగిరి సతీష్, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.