భోగ శ్రావణికి మద్దతు తెలిపిన బెక్కం జనార్ధన్

తెలంగాణ, జగిత్యాల నియోజకవర్గ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భోగ శ్రావణిని పొత్తులో భాగంగా జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి బెక్కం జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ఇవ్వడం జరీగింది. ఈ సందర్బంగా బెక్కం జనార్దన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణా రాష్ట్ర నాయకుల సూచనల మేరకు జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన భోగ శ్రావణి కి పూర్తి మద్దతు పలకాలని జగిత్యాల నియోజకవర్గవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థి అయిన భోగ శ్రావణిని గెలిపించి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు బొల్లి రాము మరియు బీజేపీ పార్టీ దులూరి వంశీ బీజేపీ నాయకులు ఇతరులు పాల్గొన్నారు.