36వ డివిజన్ లో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన భీమ్ యాత్ర మంగళవారం 36వ డివిజన్ లో టి.టి.డి కళ్యాణ మండపం వెనకాల ప్రాంతంలో మిరియాల హైమవతి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెట్టింది ఈ వై.సి.పి ప్రభుత్వమని దునుమాడారు. సంక్షేమం చేయడం ప్రభుత్వ బాధ్యత అనీ కానీ ఈ వై.సి.పి ప్రభుత్వం కొత్తపోకడలతో అది తమ ఖ్యాతి అనే రీతిలో తమఖాతాలో వేసుకోవడం ఈ ముక్యమంత్రికే చెల్లిందని ఎద్దేవా చేసారు. దళిత చిన్నారులకు మామయ్య అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో దళితుల నెత్తిన భస్మాసుర హస్తంలా తయారయ్యారనీ, అసలు ఎంతమంది దళితులకు ఇళ్ళు కట్టించారనీ, ఎంతమంది దళిత విధ్యార్ధులకి విదేశీ విద్యకి ఋణాలు మంజూరు చేసారో శ్వేతపత్రం విడుదలచేయమని డిమాండ్ చేసారు. దళితులపై ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తూ స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ముత్తా శశిధర్ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దనున్న అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలదండలతో అంజలి ఘటించి భీం యాత్ర నిర్వహిస్తున్న సభ్యులని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ నేటికి ఈ కార్యక్రమం నగరంలో అప్రతిహతంగా 25 రోజుల నుండీ నిర్వహిస్తున్నామనీ, తద్వారా అనేక అమాయక దళితులను చైతన్యవంతులుగా చేస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సుంకర సురేశు బండి సుజాత, చీకట్ల శ్రీనివాస్, బి.ఫణీంద్ర, ఎస్. గంగాధర్ మరియు జనసేన నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.