బాలల హక్కులను కాపాడాలి

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జొన్న గుడ్డి నగరపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, రబ్బర్, షార్ప్ నర్ తో కూడిన కిట్లను, బిస్కెట్లు, చాక్లెట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ పాఠశాలల్లో బాలల హక్కుల దినోత్సవాలు జరగాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న పిల్లలపై దాడులను అరికట్టాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటామని, కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని విమర్శించారు. కనీసం వారికి ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మా పాఠశాల తీసేయొద్దు అంటూ ఆ పసివాళ్లు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చదువులో రాణించాలని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విధ్యార్దులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఏంటి రాజేష్, వజ్రపు నవీన్ కుమార్, ఎమ్.పవన్ కుమార్, అభిలాష్, అడబాల వేంకటేష్, గొల్లపల్లి మహేష్, పృథ్వీ భార్గవ్ మధు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.టి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటామని, కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని విమర్శించారు. కనీసం వారికి ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మా పాఠశాల తీసేయొద్దు అంటూ ఆ పసివాళ్లు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చదువులో రాణించాలని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విధ్యార్దులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జన సైనికులు ఏంటి రాజేష్, వజ్రపు నవీన్ కుమార్, ఎమ్. పవన్ కుమార్, అభిలాష్, అడబాల వేంకటేష్, గొల్లపల్లి మహేష్, పృథ్వీ భార్గవ్ మధు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.