లంకల దీపక్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న రాధారం రాజలింగం

తెలంగాణ, జనసేన బలపరచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకులతో కార్యకర్తలతో కలిసి రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి అందరిని కలుస్తూ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం మరియు బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు మరియు జనసేన నాయకులు సానాది రమేష్ కుమార్ మరియు బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు. బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని రహమత్ నగర్ డివిజన్ వాసులను రాధారం రాజలింగం కోరారు. ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా రాధారం రాజలింగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజెసారు.