వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేద్దాం: జనసేన మురళి

అరకు: నియోజకవర్గంలో గురువారం జనసేన తెలుగు దేశం ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జనసేన మురళి మాట్లాడుతూ ఏపీలో సుస్థిర పాలన కోసం తెలుగుదేశం జనసేన కలిసి పని చేస్తున్నాయి. ఓటర్ లిస్టును అపహస్యం చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గొయ్యిలో పాతి పెట్టడానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఈ నెల నుంచి భవిష్యత్తు గ్యారెంటీ, ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జనసేన – తెలుగుదేశం పార్టీల నాయకులు సమన్వయంతో నిర్వహించాలి. నియోజకర్గంలోని ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ. ఇరు పార్టీ నాయకుల ఉమ్మడి పోరాటానికి నవంబర్ లో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై నిరసనలు చేపడతాం.. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేద్దాం అని మురళి పిలుపునిచ్చారు.