గజపతినగరం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

గజపతినగరం, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో జనసేన-టీడీపీ పార్టీల సమన్వయంతో గజపతినగరం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ మరియు సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషివర్థన్, గజపతినగరం నాయకులు శరత్, మునకల జగన్, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, దుర్గా ప్రసాద్, జనసైనికులు, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేసారు.

ఘనంగా మునకాల జగన్నాధరావు జన్మదిన వేడుకలు

గజపతినగరం, మాజీ మంత్రి వర్యులు జనసేన పార్టీ పిఏసి సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ అధ్యర్యంలో గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం మండలం అధ్యక్షులు మునకాల జగన్నాధరావు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దత్తిరాజేరు మండలం జనసైనికులు మరియు నాయకులు మామిడి దుర్గా ప్రసాద్, సాలపు రాము, అప్పలస్వామి, ప్రవీణ్, మరియు త్రివేది, యస్వంత్, కిరణ్, గణపతినగరం మండలం జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.