మీ ప్రభుత్వం ఇచ్చిన భూములా? స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి

నూజివీడు భూ పట్టాల పంపిణీ బహిరంగ సభ ద్వారా పేదలకి, 34 లక్షల ఎకరాలకు భూములపై సర్వ హక్కులు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి మీరు భూహక్కులు కల్పించిన భూములు గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చిన భూములా? లేకపోతే మీ ప్రభుత్వం ఇచ్చిన భూములా? స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరికి ఎన్ని ఎకరాలు భూ హక్కు కల్పించారు? ఏ ఏ కంపెనీలకు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? స్పష్టమైన వివరాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. మీరు ఏ పథకం ప్రవేశపెట్టిన బయటకి చెప్పే అంతా నిబద్ధత, నిజాయితీ ఆ పథకాల అమలులో కనిపించట్లేదు. ఉదాహరణకి జగనన్న విద్యా దీవెన కిట్లు పంపిణీలో 120 కోట్ల అవతల జరిగాయని ఈడి ఎంక్వైరీలో తేలింది. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ కంపెనీల ద్వారా బడి పిల్లలకు సప్లై చేసిన బ్యాగులు, బూట్లు నాశరకంగా ఉన్నాయి అని, ఈడీ విచారణలో వెల్లడయ్యింది. బడి పిల్లలకు కిట్లు అందజేసిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ చెందిన కంపెనీలన్నీ బినామీ కంపెనీలని తేలిపోయింది. గతంలో మీ నాన్నగారి హయామంలో అసైన్మెంట్ యాక్ట్ తెచ్చినప్పుడు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు? మీ అనయంగులకు? కావలసినంత భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేకరించుకొని, అసైన్మెంట్ యాక్ట్ తెచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శించాయి, కానీ ఏరోజు కూడా మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వివరణ ఇవ్వలేదు నేటి వరకు. ఎన్నికల ముందర మీరు సంపూర్ణ మద్యనిషేధమంటే రాష్ట్రంలో మద్యం అమ్మకుండా నిషేధిస్తారని అనుకున్నాం? కానీ కొత్త బినామీ కంపెనీలు తెచ్చుకుని మద్యం అమ్ముతారని రాష్ట్ర ప్రజలకు తెలియదు? మీరు పైకి చెప్పేదొకటి లోపల చేసేదొకటని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థం అయిపోయింది. ఇండోసోల్ సోలార్ కంపెనీకి భారీ ప్రయోజనం చేకూరే విధంగా గతంలో కేటాయించిన 5,148 ఎకరాలు చాలదని, అదనంగా 3,200 ఎకరాల భూ సేకరణకు అనుమతి ఇవ్వడం, లీజు విధానానికి బదులు “సమస్త” పేరిట “రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా” రిజిస్ట్రేషన్ చేయడం, అదనంగా ట్రాన్స్కో ఖర్చులతో రాయితీలు కల్పించడం చూస్తుంటే భూ హక్కు పథకం ద్వారా ఏదో కొత్త కుంభకోణానికి శ్రీకారం చుట్టినట్లగా ఉంది అని కొంతమంది మేధావులు చెబుతున్నారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి కాకి లెక్కాచారలు? కల్లిభొల్లి లెక్కాచారాలు కాకుండా? 34 లక్షల ఎకరాలు ఎవరెవరికి భూ హక్కు కల్పించారో? సంపూర్ణంగా వారందరి వివరాలు తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.