చెవిటికల్లు మున్నలూరు మార్గంలో గుంతల రోడ్లపై నిరసన

  • నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి

కంచికచర్ల మండలం: రాష్ట్ర జనసేన తెలుగుదేశంపార్టీల ఉమ్మడి కార్యాచరణ గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమములో భాగంగా స్థానికులు, తెదేపా జనసేన నేతలు మరియు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవిగారితో కలిసి చెవిటికల్లు మున్నలూరు గ్రామం రహదారిలో గుంతలను పరిశీలించి జిఎస్పి డస్ట్ తో గుంతలను పూడ్చిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. కంచికచర్ల మండలం చెవిటికల్లు నుండి మున్నలూరు వెళ్లే రోడ్డు లో ఈ కార్యక్రమంలో శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ.. ఈ రోడ్డు చూస్తుంటే నిలువెత్తు గుంతలు కనిపిస్తున్నాయి మరోపక్క మేము ఇక్కడ నిల్చున్న అరగంటలోనే ఈ రోడ్డులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 25 లారీలు వెళ్లాయి.మరో పక్క ఇసుక కొండలు వెలిశాయి అరగంట లో 25 లారీలు వెళ్తున్నాయి అంటే ఇక రోజులో ఎన్ని వెళ్తున్నాయి అర్థం చేసుకోండి. ఈ నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వంలో రోడ్లు కాదుగ కనీసం గుంతలు పూడ్చిన పరిస్థితి లేదు. రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి గర్భిణుల పరిస్తితి అయితే దారుణం. పక్క రాష్ట్రాల వాళ్లు మనమీద జోకులు వేసే పరిస్తితి కి వచ్చారు మొన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సింగిల్ రోడ్ వస్తే ఆంద్రప్రదేశ్ డబల్ రోడ్లు వస్తే తెలంగాణ అని మాట్లాడారు అయినా సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 7000 కోట్లు దుర్వినియోగం చేశాడు ఒకపక్క మా దగ్గర నుండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి…
ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంద్రప్రదేశ్ దురదృష్టం. దొంగకు అధికారం ఇస్తే ఇలాగే పరిపాలన చేస్తాడు. అబద్ధాలు కూడ నిజాయితీగా చెప్పడం ఈ ముఖ్యమంత్రికి అలవాటుగా మారింది. మరోపక్క వేలాది టన్నుల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు మాకు ఏం తెలియదంటారు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ రోడ్లు బాగు చేయాలి గుంటలన్నీ పుడ్చాలి లేదంటే రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.