కొండపి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం

కొండపి నియోజకవర్గం: సింగరాయకొండ మండల కేంద్రంలో రహదారుల దుస్థితిపై జనసేన మరియు టిడిపి ఇరుపార్టీల ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా “గుంతలఆంధ్రప్రదేశ్ కు దారేది” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి “జగనన్న గుంతల” పథకాన్ని ప్రవేశపెట్టారు. కొండపి నియోజకవర్గంలో కనీసం ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం, రహదాలను కూడా గుంతలమయం చేసి, నిత్యం ప్రజలు ప్రమాదాలకి గురి అవుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఈ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ ప్రజలను అభివృద్ధి చేస్తున్నాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్న తరుణంలో కొండపి నియోజకవర్గంలో ప్రజలను అభివృద్ధి చేసే బటన్ నొక్కటం మర్చిపోయినట్టున్నారు. జగనే మళ్లీ రావాలి అని ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన ప్రజలు జగన్ పోవాలి “జనసేన మరియు టిడిపి ఉమ్మడి పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం” అవుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు. జగన్ అవినీతిపై జనసేన టిడిపి ఉమ్మడి కార్యచరణతో నిత్యం పోరాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలపై పోరాడుతూ ఎండగడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని కొండపి నియోజకవర్గం ప్రజలందరికీ భరోసా కల్పిస్తామని, వారికి అండగా ఉంటామని మీడియా, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము, ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, జనసేన సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, కొండపి నియోజకవర్గం టిడిపి మరియు జనసేన ఇరుపార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరమహిళలు భారీసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.