రాజంపేటలో రోడ్ల దుస్థితిపై జనసేన, టీడీపీల డిజిటల్ క్యాంపెయిన్

రాజంపేట: జనసేన మరియు తెలుగుదేశం ఉమ్మడి పార్టీల సారధ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది?? 2వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన, తెలుగుదేశం ఉమ్మడి పార్టీల నేతలు రాజంపేటలో ప్రధాన రహదారిపై అడుగు ఒక గుంత గజానికి ఒక గొయ్యి అంటూ నినాదాలతో గుంతల రాజ్యం చేశారని మోకాళ్ళ మీద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా అవసరాల రిత్యా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు అనునిత్యం వాహనాలలో రద్దీగా నిరంతరం రవాణా చేస్తూంటారు.అందులో ముఖ్యంగా కడప నుంచి తిరుపతికి వెళ్ళే ప్రధాన రహదారిపై వాహనాల ద్వారా ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరుటకు కనీసం రోడ్ల సౌకర్యం కల్పించలేని చేత కాని ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా ప్రజల నుండి వివిధ రకాల రూపంలో పన్నులు ద్వారా వసూలు చేసి ప్రభుత్వం చెయ్యాల్సిన అతిముఖ్యమైన ప్రజా అవసరాలను మరియు రోడ్లపై గుంతలు పడి అద్మానంగా పడయిపోయిన రహదారుల సర్వీస్ అభివృద్ధి పనులు పక్కన పెట్టి అనవసరమైన ఉచిత పథకాలు ద్వారా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మరీ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ టీడీపీ మైనార్టీ నేత కరీమ్ భాష, జనసేన నాయకులు అబ్బిగారి గోపాల్, గురివిగారి వాసుదేవ, గోపికృష్ణ, రామయ్య, హరి, టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.