అంగన్వాడీల నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు సిపిడిఓ ఆఫీస్ ప్రాంగణంలో రాజోలు తాలూకా అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ వారు చేస్తున్న అంగన్వాడీల నిరాహార దీక్షకు రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి వారు చేస్తున్న సేవలు వల్ల రాష్ట్రంలో కాదు భారతదేశంలో శిశు మరణాల రేటు 20 సంవత్సరాల క్రితం 1000కి 86 మంది చనిపోతూ ఉండేవారు. కానీ అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 1000కి 34 మంది చనిపోతున్నారు. ఇంత తగ్గుదలకి కారణం కేవలం అంగన్వాడి వర్కర్స్ అంగన్వాడి హెల్పర్స్. మీరు ముఖ్యంగా భావితరాన్ని అంటే పిల్లలను తీర్చిదిద్దడానికి ఫిజికల్ గా, సైకలాజికల్ గా అన్ని రంగాల్లో మీరు చేస్తున్న సేవ వర్ణనాతీతం. కానీ మిమ్మల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత బాధపెడుతుందంటే తప్పనిసరిగా అందరు ఆలోచించాలి. మీరు చెప్పిన సమస్యలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు మంచి మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్, సుదీర్ఘ అనుభవం ఉన్న విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, తప్పనిసరిగా వారి ముందుకి తీసుకుని వెళ్తాము. వచ్చే ప్రభుత్వంలో మీకు మంచి జరిగినట్లు చేస్తాము. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలో తెలియదు భావితరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, మిమ్మల్ని కాదు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఇదే విధంగా బాధపడుతున్నాడు. మీరు చేస్తున్న ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి నూటికి నూరు శాతం జనసేన పార్టీ మద్దతు ఉంటుంది. తప్పనిసరిగా మీతో చివరి వరకు నడుస్తాం అన్నారు.