అన్నమయ్య వరద బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజంపేట, సీఎం సొంత జిల్లా కడప జిల్లా అన్నమయ్య ఆనకట్ట తెగి ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయి అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికి ఈ చేతకాని, చేవలేని ప్రభుత్వం ప్రజలకు చేసింది మాత్రం శూన్యం అని దినేష్ ధ్వజమెత్తారు. బాధితులకి ఉడత సాయంగా మొదటి నుంచి ఆదుకుంది జనసేన పార్టీ మాత్రమే అని గుర్తుచేశారు. అయితే ఈ వైసీపీ వైఖరి చెవుటోడి చెవిలో శంఖం ఊదినట్టు బాధితులు ఈ వైసీపీ ప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకు పలుమార్లు విన్నపాలు చేసినప్పటికి బాధితులని పట్టించుకోక పోవడం ప్రభుత్వ వైఫల్యం అని తక్షణమే బాధితులను ఈ వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో రోడ్డులెక్కి ఉద్యమించడానికి సైతం జనసేన పార్టీ వెనకాడబోమని అతికారి దినేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఆరు మండలాల నుంచి జనసేన నాయకులు మరియు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామయ్య, జగపతిబాబు, శివరామ్, నరసయ్య, స్థానిక గ్రామస్థులు, మహిళలు, జనసైనికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముకరం చాన్, జనసేనపార్టీ ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, రాజంపేట జనసేన-టిడిపి అతికారి దినేష్, జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, కడప జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గురివిగారి వాసుదేవ, కొట్టే శ్రీహరి, నాగార్జున, హేమంత్, మస్తాన్ , నరేంద్ర, పత్తి విస్సు, యువ నాయకులు గోపాల్ రాజంపేట నాయకులు పొలిశెట్టి శ్రీనివాసులు, పలుకూరు శంకర్ మైనార్టీ నాయకులు లతీఫ్, మహబూబ్ భాష, బీసీ నాయకులు చౌడయ్య యువ నాయకులు జెట్టి మస్తాన్, ఉమ్మడి ప్రభుత్వం వస్తే ముందస్తుగా అన్నమయ్య డ్యాం బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ వారికి మేము అండగా ఉంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. గ్రామస్తులతోపాటు ఎన్ఆర్ఐ జనసైనికులు పాల్గొనడం జరిగింది.