జగనన్న భూరక్ష సర్వే కాదు- జగనన్న భూభక్ష సర్వే

  • మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి
  • జగనన్న భూరక్ష పథకం అంత పచ్చి అబద్ధం రి భూసర్వేలో ఎక్కువ మోసం జరుగుతు ఉంది.
  • జగనన్న కొత్త పాసు పుస్తకాలను కాల్చి వేసిన కల్లుమర్రి పంచాయతీ రైతులు, మహిళలు

మడకశిర నియోజకవర్గం: మడకశిర మండల పరిధిలోని కల్లుమరి గ్రామ సచివాలయం ఎదుట మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. కల్లుమరి పంచాయతీలో రైతుల భూములను కొత్తగా రీ సర్వే చేసి ఇచ్చిన పాస్ బుక్ జెరాక్స్ లను సచివాలయం ఎదుట తగలి పెట్టారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ.. మడకశిర తాసిల్దార్ కు మీడియా తరఫున మాట్లాడుతూ.. కల్లుమరి పంచాయతీకి సంబంధించిన రైతుల భూములను 30వ తారీఖు లోపల రి సర్వే చేసి వారికి ఉన్న పొలాలు ఎంత ఉన్నాయని రీ సర్వే చేసి రైతులకు అందించకపోతే డిసెంబర్‌ ఒకటవ తారీఖున రైతులతో కలిసి సచివాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలియజేశారు. రీ భూసర్వే కాదు భూ భక్ష సర్వే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, పట్టణ అధ్యక్షుడు మనోహర్, కల్లుమర్రి సర్పంచ్ నాగరాజు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రంగస్వామి, జిల్లా సమ్యూక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ, పట్టణ జనసేన అధ్యక్షుడు శివాజీ, గుడిబండ మండలం అద్యక్షుడు మంజునాథ్, నాగేష్, క్లస్టర్ ఇన్చార్జ్ కన్నా, మల్లికార్జున, కృష్ణమూర్తి, నియోజకవర్గ మీడియా కో ఆర్డినేటర్ రవికుమార్, మండల తెలుగు యువత అధ్యక్షుడు మారుతీ రెడ్డి, కల్లుమరి పంచాయతీ ఉప సర్పంచ్ మోహన్, వీరక్యతప్ప, పేద్ద మూర్తి, నరసింహమూర్తి, (బజ్జి) కొండప్ప, నరసన్న, జంగం రెడ్డి, ప్రభాకర్, రైతులు, మహిళలు మరియు తెలుగుదేశం పార్టీలో నాయకులు పాల్గొన్నారు.