జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 11వ రోజు

శ్రీకాళహస్తి, భవిష్యత్తు గ్యారంటీ జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 11వ రోజు జనసేన ఇంటింటికీ ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఉమ్మడి మినీ మానిఫెస్టోను శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా తొట్టంబేడు మండలం, జ్ఞానమ్మ కండ్రిగ హరిజనవాడ గ్రామంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. పెన్షన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నానని సమస్య తెలిపిన ఒక వృద్ద మహిళలకి అప్పటికప్పుడు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు తెప్పించి ఇవ్వడం జరిగింది. గ్రామంలో త్రాగడానికి నీళ్ళు లేవని, టాంక్ నిర్మాణం చేసినా నిరుపయోగంగా ఉందని తెలిపారు. గ్రామంలో రోడ్డు అద్వాన స్థితిలో ఉంది, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజీ కాలువలు లేవు, స్మశానానికి దారి కూడా దారి లేని దయనీయ స్థితిలో ఉన్నామని ప్రజలు ఆవేదన తెలిపారు. సమస్యలన్నీ ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని వినుత ప్రజకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, నాయకులు పేట చిరంజీవి, రాజేష్, సురేష్, గురవయ్య, జ్యోతి రామ్, హేమంత్ , దినేష్, ఉదయ్, జనసైనికులు మహేష్, షన్ముఖ, తులసీ రామ్, గోపి తదితరులు పాల్గొన్నారు.