ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత అధికారులకు లేదా?: కనపర్తి మనోజ్

కొండపి నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువుల్లో కూడా ఈ దొంగలే చెట్లను నరుకుతారేమో అని ప్రజలు భయపడుతున్నారు. అధికారం లేకపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న కనపర్తి మనోజ్ కుమార్ ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో పొన్నలూరు ఎస్సై సాంబశివయ్యని మంగళవారం జనసేన నాయకులు కలవడం జరిగింది. పొన్నలూరు పెద్ద చెరువులో దొంగలు పడి దాదాపు 10 లక్షలు విలువచేసే పచ్చని చెట్లను నరికివేసి అమ్ముకోవడం జరిగింది. ఇదే తరహాలో నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి అన్ని చెరువుల్లో ఇక్కడ దొంగలే అన్నిచోట్ల పడి చెట్లను నరికివేసి అమ్ముకుంటారేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు ఎందుకని ఈ విషయంలో చొరవ చూపించడం లేదు? ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత అధికారులకు లేదా? ప్రభుత్వం నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా పచ్చని చెట్లను నరికి అమ్ముకున్న దొంగలను త్వరగా కనిపెట్టండి. జనసేన పార్టీకి అధికారం లేకపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని జనసేన పార్టీ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నలూరు జనసేన నాయకులు కర్ణ తిరుమలరెడ్డి, షేక్ మహబూబ్ బాషా, కాకాని ఆంజనేయులు, కర్ణ జయరామిరెడ్డి, చందు, సుంకేశ్వరం శ్రీను, లక్ష్మణ్, నవీన్ పాల్గొన్నారు.