37వ డివిజన్ లో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: 37వ డివిజన్ లో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ప్రజలను చైతన్యపరుస్తూ దళితులు, బడుగులపై దౌర్జన్యాలు, అణిచివేతలు హత్యలు రాష్ట్రంలో నిత్యం జరుగుతుంటే వాటిని ఆపలేని ఈ ప్రభుత్వం తన చేతకానితనాన్ని ఒప్పుకుని దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. అసలు మానవ హక్కుల సంస్థలు, సంఘాలు ఏమైపొయాయో అర్ధం కావడంలేదనీ, కనీసం నిందితులపై చర్యలు ఉపక్రమించకపోయిన విషయం కాసేపు పక్కనపెట్టి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం హెచ్చరిక కూడా చేయట్లేదంటే తను వారికి ప్రోత్సాహం ఇస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. ఊడిగం చేసే రోజులు పోయాయనీ దళితులలో వచ్చిన చైతన్యం రాబోయే ఎన్నికలలో రుచి చూస్తారన్నారు. జనసేన పార్టీ దళితుల తరపున పోరాటాలకి ముందుంటుందని తమ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి పోరుకు మద్దతు కోరారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వాసిరెడ్డి శివ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సిటీ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, సిటీ సహాయ కార్యదర్శి మిరియాల హైమవతి, డివిజన్ నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ, మనోహర్ లాల్, బలసాడి శ్రీను, పినపోతు సత్తిబాబు, ఆకుల శ్రీనివాస్, సుంకర సురేష్, సుజాత, బోడపాటి మరియ, బట్టు లీల, మడత శాంతి, గంపల పైడితల్లి, ఓలేటి చినతల్లి, చోడిపల్లి సత్యవతి, రమణమ్మ, చికట్ల శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.