డీఎస్పీ ని కలిసిన యల్లటూరు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పోలీసు సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ వి కె ఎన్ చైతన్యను రాజంపేట నియోజకవర్గ జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమీప భవిష్యత్తులో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో ఆయనను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందలూరు మాజీ జెడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, ఆకుల చలపతి తదితరులు పాల్గొన్నారు.