జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటి ప్రచారం

  • ఉమ్మడి మేనిఫెస్టోను మెయిన్ రోడ్ షాప్స్ ఓనర్స్ కి వివరించిన జనసేన – తెలుగుదేశం నాయకులు
  • ఈ వైసీపీ రాక్షస పాలన మాకొద్దు – మీ ఉమ్మడి పాలనే మాకు కావాలి అని మద్దతు తెలిపిన పట్టణ షాప్ యజమానులు
  • సానుకూలంగా స్పందించిన ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, వ్యాపారస్తులు, యూనియన్స్ వాళ్ళ మరియు వివిధ శాఖలు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతిపురం మున్సిపాలిటీలో గల మెయిన్ రోడ్ లో “బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి షాప్ కి కరపత్రాలు అందిస్తూ ఓనర్స్, వర్కర్స్ మరియు కార్మికులను కలిసి జనసేన టిడిపి ఉమ్మడి మేనిఫెస్టోని వివరిస్తూ 2024 ప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు, వ్యాపారస్తులకు, యూనియన్స్ వాళ్ళకి మరియు వివిధ శాఖలకు చెందిన వాళ్లకు ఉమ్మడి ప్రభుత్వం ఎలా అండగా ఉంటుందో ఇరు పార్టీ నాయకులు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ పాలనలో విసిగిపోయిన వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ 2024 వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం స్థాపించేందుకు తమ వంతు కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో ప్రజల స్పందన చూస్తే 2024 జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా సాధిస్తుందని ఇరు పార్టీ నాయకులు కచ్చితంగా చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఇంచార్జ్ బోనెల విజయ చంద్ర, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్ నాయుడు, బార్నాల సీతారాం, గుంట్రెడ్డు రవి, జనసేన సీనియర్ నాయకులు నెయ్యిగాపుల సురేష్, కడగల శ్యాంసుందర్, సిరిపురపు గౌరీ, మానేపల్లీ ప్రవీణ్, భమిడిపాటి చైతన్య, హర్ష, గోపీసెట్టి రంగా రావు తదితరులు పాల్గొన్నారు.