కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు 37వ డివిజన్ పాతబస్ స్టాండ్ ప్రాంతంలో బలసాడి శ్రీను ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగుల కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు మాలే గుర్రమ్మ, మాతా స్వరూపలను కలిసి వారితో వారి సమస్యలపై మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. మిగిలిన వారి బాధలతో పోలిస్తే దివ్యాంగుల బాధలు భిన్నంగా ఉంటాయన్నారు, వీరికి ఆదాయపరంగానే కాకుందా, శరీరకంగా, మానసికంగా రక రకాల కోణంలో ఎదుర్కోవాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో జీవనం సాగించడమే కష్టతరంగా మారిందనీ అలాంటిది దివ్యాంగులకు ఎలా ఉంటాదో ఒక్కసారి ఈ వై.సి.పి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. వారి వ్యక్తిత్వ హననం జరగకుండా కాపాడుతూ వారి మనోధైర్యం పెంచుతూ వికాశం పొందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ కానీ ఈ ముఖ్యమంత్రి బాదుడే.. బాదుడు మీద ఉన్న ధ్యాస ఇంకదేనిమీదా ఉండదని ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ప్రయోజనాలకోసం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటునంటూ తమకు మద్దతుని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తిబాబు, అభిరాం, మల్లాడి రాజేష్, రాకేష్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.