తిరుమలమ్మపాలెం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాం

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిరుమలమ్మపాలెం గ్రామానికి వరదలు, తుఫాన్ సమయంలో రాకపోకలు ఆగిపోయే వంతెనను మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సోమవారం గ్రామస్తులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమలమ్మపాలెం పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న వంతెన నిర్మాణం జరగలేదు. వర్షాలు, వరదలు వచ్చినా మొట్టమొదట సర్వేపల్లి నియోజకవర్గంలో రాకపోకలు ఆగిపోయేటువంటి తిరుమలమ్మపాలెం గ్రామానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.9 కోట్ల రూపాయల నిధులతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. వెంటనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో శ్రీ దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ మూడవ గ్రిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి నిధి నుంచి రూ.12 కోట్ల రూపాయల నిధులతో తిరుమలమ్మపాలెం గ్రామానికి హైలెవల్ వంతెన నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఎనిమిది నెలలు అవుతున్న ఇప్పటివరకు హై లెవెల్ వంతెన నిర్మాణం గురించి కనీసం స్పందన లేదు. 12 కోట్ల రూపాయలతో శిలాఫలకం వేసారే తప్ప హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గత రెండు నెలల క్రితం జనసేన పార్టీ అక్కడికి వెళ్లి పరిశీలించి ఆ హైలెవెల్ వంతెన నిర్మాణం గురించి ప్రస్తావించడంతో 12 కోట్లు నుండీ 13 కోట్ల రూపాయలు నిధులతో హైలెవెల్ వంతెన నిర్మాణం చేస్తామని చెప్పి ఆరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రింట్ మీడియా ద్వారా తెలియజేశారు. కానీ హైలెవెల్ వంతెన నిర్మాణం గురించి స్పందన లేదు. దీంతోపాటు తిరుమలమ్మపాలెం గ్రామంలో తుఫాన్ షెల్టర్ అస్తవ్యస్తంగా ఉంది. దానిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. రేపు 2024లో ప్రజా ప్రభుత్వంలో తిరుమలమ్మపాలెం గ్రామానికి కలగా ఉన్న హైలెవెల్ వంతెన, తుఫాన్ షెల్టర్ ఈ రెండిటిని నిర్మించి తీరుతాం. ప్రజా ప్రభుత్వంలో తిరుమలమ్మపాలెం గ్రామానికి జనసేన, టీడీపీలు కలిసి ఇచ్చే గిఫ్ట్. అలాగే తిరుమలమ్మపాలెం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు ఇచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సండూరి శ్రీహరి, పినిశెట్టి మల్లికార్జున్, సుమన్, విజయ్, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.