విజయవంతంగా జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన భీమ్ యాత్ర జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో గత నలభై రోజులుగా కాకినాడ నగరంలో భీంయాత్ర విజయవంతంగా నిర్వహించి సోమవారం టీం సభ్యులు బయలుదేరి ముంబాయిలో డిసెంబరు 6వ తారీఖున జరుగు చైత్య యాత్రలో సేకరించిన మట్టిని అక్కడ ఉంచడం కోసం పయనమవుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు యాత్ర ముగింపు కార్యక్రమం ఎక్కడ అయితే భీం యాత్ర మొదలుపెట్టారో ఎక్కడ అయితే అంబేడ్కర్ నడిచారో ఆ పుణ్య భూమి పి.ఆర్ కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో వెనకబడి సరైన మార్గనిర్దేశం లేకపోడంతో చాలా మంది దళితులు కూలీ పనులతో తమ జీవనం సాగించడం మనం చూస్తున్నామనీ, దీనిని మార్చడానికి సామాజిక చైతన్యం చాలా అవసరమన్నారు. పిల్లలతో కూలీ సంపాదనపై ఆధారపడకుండా వారికి కొంత ఆదాయ వనరులను కల్పించి తద్వారా చదువులవైపు ప్రోత్సహించాలనీ అందుకు తగ్గ హాస్టళ్ళు మెస్సులు అభివృద్ధి చేయడం, ప్రోత్సాహకాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత ఐతే, నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం దళితుల అభ్యుదయానికి తోడ్పడుతున్న హాస్టళ్ళు మెస్సుల నిర్వాహణ మరియు పధకాలను గాలికి వదిలేసిందని దీనిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితిపై సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్ట్ తీవ్రవ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనమని విమర్శించారు. ఈ వై.సి.పి ప్రభుత్వం పాలనలో విఫలమైందనీ, పాలించే అర్హత కోల్పోయిందన్నారు. దళిత యువత సమస్యలపై జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారధ్యంలో త్వరలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ ముఖ్యమంత్రిని ఇంటికిపంపే రోజులు దగ్గరపడ్డాయని అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తదుపరి ముంబై బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు సుంకర సురేష్, శ్రీమన్నారాయణ, ముత్యాల దుర్గాప్రసాద్, అగ్రహార సతీష్, చీకట్ల వాసు, తోరం చిరంజీవి, ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, వీరమహిళలు బండి సుజాత, బట్టు లీల, రమణమ్మ, ఉమా, సోనీ ఫ్లోరెన్స్, సబ్బే దీప్తి, మిరియాల హైమావతి, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు.