రైతులను ముంచేసిన మిచౌంగ్ తుపాను

గూడూరు, నియోజకవర్గంలోని పలు మండలాల్లో మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసి నష్టాలను మిగిల్చిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు. చిట్టమూరు మండలంలో వందల ఎకరాల్లో నీట మునిగిన వరి నాట్లును బుధవారం మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో వరి నాట్లు పూర్తిగా మునిగి ఇసుక మేట వేయదంతో రైతన్నలకు తీరని శోకం మిగిల్చిందన్నారు. నష్టపోయిన రైతన్నలనుప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్ట పరిహారం అందచేయాలనీ డిమాండ్ చేసారు. అనంతరం చిట్టమూరు మండలం కొత్తగుంట- కొగిలి గ్రామానికి మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సోమవారం గ్రామస్తులతో కలిసి పరిశీలించిన అయన కొగిలి పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న వంతెన నిర్మాణం జరగలేదని, వర్షాలు, వరదలు వచ్చినా రాకపోకలు ఆగిపోతాయని, 20 ఏళ్లుగా ఈ విషయాన్నీ అధికారులు, రాజకీయ నాయకులకు చెప్పినా కానీ వంతెన నిర్మాణం గురించి స్పందన లేదని గ్రామస్తులు తెలిపారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంలో కొత్తగుంట- కొగిలి వంతెన ఏర్పాటు చేస్తామని తెలిపారు.