గోగుబాక గ్రామ వాసులకు రేషన్ బియ్యం అందించాలి

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, ఏటపాక మండలం నెల్లిపాక పంచాయితీలో గల గోగుబాక గ్రామంలో గత మూడు నెలల నుంచి రేషన్ సరుకులు గ్రామస్తులకు ఇవ్వడం లేదు గ్రామస్తులు ఇబ్బందులు బియ్యం 60 రూపాయలు పెట్టి కొనుక్కొని తినలేక ఇబ్బంది పడుతున్నారు. అది తెలుసుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్ జన సైనికులతో ఆ గ్రామానికి వెళ్లి అక్కడ వున్న గ్రామస్థులను వారి సమస్యను అడిగి తెలుసుకోగా మూడు నెలల నుంచి బియ్యం నిత్యావసర సరుకులు రావడం లేదని అకాల వర్షాలతో పనులు లేక రేషన్ నుంచి వచ్చే బియ్యం నిత్యవసర సరుకులు రాక తినటానికి గడవక ఇబ్బందులు పడుతున్నారు అని గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి మూడు నెలలకు సంబంధించిన రేషన్ రెండు రోజుల్లో ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లిపాక పంచాయతీలో మూడు నెలల నుంచి సరుకులు అందనీ వరందని గ్రామస్తులందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రాయల నాగరాజు, కొట్టే కృష్ణ, తోకల పవన్, కాంపాటి సాయి, లాడే ప్రవీణ్, వరక ప్రశాంత్, గద్దల సాయిరాం, ఎన్నా పండు, నూకల దివ్య, తెలుగు మహిళా ప్రెసిడెంట్ తేచార ప్రమీల, బాసిపోయిన నాగేశ్వరరావు, కుర్రం రాంబాబు, బురం వెంకటప్పయ్య, కాకర చంటి, చింతా సావిత్రి, చింతా మణిక్యం, చింతా తిరుపతమ్మ, ఈసుపల్లి శారద, పోసి బాబు, మల్లాడి ఇంకా అధిక సంఖ్యలో గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు.