మిచౌంగ్ తుఫాను బాధితులను పరామర్శించిన శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి

నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవార రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నందిగామ జనసేన-టిడిపి సమన్వయ బాధ్యులు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కు సమానత్వం ఉండాలనే ఆకాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ఫలాలు నేడు ఈ వైసీపీ ప్రభుత్వం దళితులకు అందకుండా చేస్తోంది. మా అధినేత పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీలో అందరికీ సమానమైన ప్రాధాన్యతను ఉండేలా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని ఆయన పార్టీ సిద్ధాంతాలలో రూపొందించడం జరిగింది. రాబోవు 2024 ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు ఇరు పార్టీలు అండగా ఉంటాయని తెలియజేశారు. తరువాత నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన పంట పొలాలు పరిశీలించి, నష్టపోయిన రైతుల్ని కలిసి వారిని పరామర్శించి ప్రభుత్వం నుండి వారికి రావలసిన నష్టపరిహారాన్ని వచ్చేలా చేస్తామని రైతులకి అండగా జనసేన పార్టీ ఎల్లప్పుడు ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిగామ టౌన్ అధ్యక్షుడు తాటి శివకృష్ణ, 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, చందర్లపాడు మండలాధ్యక్షులు వడ్డెల సుధాకర్, తిప్పల కోటేశ్వరరావు, ఆకుల వెంకట్, సూర్య తేజ, తాటి నరేంద్ర, కర్రి హనుమంతు, కొమ్మవరపు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.