షణ్ముఖ వ్యూహంలో భాగంగా యువతకు ఆర్థిక ప్రోత్సాహకం

తంబళ్లపల్లె నియోజకవర్గం: బి కొత్తకోట మండలం, గట్టు గ్రామపంచాయతీ పర్యటనలో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ (ఇన్చార్జ్) పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో గట్టు గ్రామం భోజ రాజు సమక్షంలో శనివారం తోట దుర్గాప్రసాద్ (బీటెక్ ఎలక్ట్రానిక్) వారి సోదరుడు వెంకటేష్ ప్రసాద్ (బీఎస్సీ అగ్రికల్చర్) చదివి వారి సొంత నియోజకవర్గానికి ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయం అతి తక్కువ ఖర్చుతో రిక్రూట్మెంట్ పరికరాలు, పంటలకు మందులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలి అనే మంచి ఆలోచనతో ఉన్నారని పోతుల సాయినాథ్ దృష్టికి రావడంతో వెంటనే వారు స్పందించి వారిని కలిసి వివరాలు సేకరించారు, ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే నియోజకవర్గంలో కొంతమందికైనా ఉపాధి లభిస్తుందని ఇలాంటి వారిని గుర్తించడం పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని తెలియజేశారు. అలాగే రాబోయే జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో షణ్ముఖ వ్యూహంలో భాగంగా యువతలో కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక ఉన్న యువతకు ప్రతి నియోజకవర్గం నుండి 500 మందిని ఎంపిక చేసి అందులో పది మందికి సంవత్సరానికి ఒకేసారిగా 10 లక్షలు రూపాయలు అందించి చిన్నపాటి పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఆర్థిక సాయం అందజేస్తామని అందుకు నేను భరోసా కల్పిస్తానని పోతుల సాయినాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, జెసిపి శ్రీనివాసులు, హనుమంత్ లోకేష్, శ్రీకంట పాల్గొన్నారు.