వైసిపిని సాగనంపడమే జేఎస్పీ లక్ష్యం

  • పాలసముద్రం మండలాన్ని మానస సరోవరంలా మారుస్తాం
  • పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వండి
  • నియోజకవర్గాన్ని రోల్ మోడల్ చేస్తాం
  • జనసేన ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: పాలసముద్రం మండలం, పాలసముద్రం గ్రామపంచాయతీ, మణిపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన (భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ మరి ఎమ్మెల్యే అభ్యర్థి యుగంధర్ పొన్న చక్రాల కుర్చీ మీదనే ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబంతో మాట్లాడుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరించడం గమనార్హం. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ రాష్ట్రంలో, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా మానవ హక్కులను కాల రాసిన వైసిపిని సాగనంపడేమే లక్ష్యమని పేర్కొన్నారు. పాలసముద్రం మండలాన్ని మానస సరోవరంలా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా రోడ్ల కోసం అనేకమార్లు ధర్నాలు నిరసనలు ఆమరణ దీక్షలు చేయడంతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చి రోడ్లు వేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గం లో ఉన్న ప్రజలను, ప్రత్యేకంగా పాలసముద్రంలో ఉన్న ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, ఒక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగిన పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వండని, అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గాన్ని రోల్ మోడల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ రూపేష్ రాజు, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, చిత్తూరు జిల్లా కార్యక్రమం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, యువజన కార్యదర్శి అన్నమలై, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి హరీష్, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వాసు నాయుడు, మండల కార్యదర్శి ప్రవీణ్, నియోజకవర్గ యువజన కార్యదర్శి కోదండన్, జనసేన నాయకులు దేవా నాయుడు, నరేష్, వినోద్, బాలాజీ, కుమార్, మోహన్, వెంకటేష్, పెద్దబ్బ, గిరి, రామచంద్ర మందడి, బాలయ్య, కిషోర్, దొరసామి రాజు, రమేష్, అరుణ్ పాల్గొన్నారు.