అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన బర్మా ఫణి బాబు

నూజివీడు: జనసేన నూజివీడు సమన్వయకర్త బర్మా ఫణి బాబు, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో కలిసి అంగన్వాడీలకు తమ నైతిక మద్దతును తెలిపారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీలకు జీతం కేవలం 1,000/- మాత్రమే పెంచారు, అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన జనసేన నేత బర్మా ఫణి బాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు చేశారని విమర్శించిన నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టిన అంగన్వాడీలకు మద్దతు తెలిపిన జనసేన నేత బర్మా ఫణి బాబు. తమ హక్కుల కోసం అంగన్వాడీలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారిపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతుందన్న బర్మా ఫణి బాబు. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014 ముందు వరకు అంగన్వాడీ జీతాలు 4200 ఉండగా కార్యకర్తల జీతాలు మూడువేల రూపాయల వరకు ఉన్నాయన్నారు, వాటిని కార్యకర్తలకు 10,500 సహాయకులకు 6000 వరకు పెంచడంతోపాటు 18301 అంగన్వాడి కేంద్రాలను టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ధార్మిక సభ్యురాలు నిట్ల.ఉమామహేశ్వరి, జనసేన పార్టీ నూజివీడు మండలం ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్. నూజివీడు జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, సూరీసెట్టి శివ, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, గొల్లపల్లి గిరి, రెడ్డి సంతోష్, వినోద్, రాజేష్, వెంకట్రావు, ఇమ్రాన్, బజారు నందీశ్వర్, గుండ్రు మణికంఠ, బొక్కినాల రాజు, కిషోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మలిశెట్టి జగదీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు నూతక్కి వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి పల్లి నాగరాజు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తలపంటి రాజశేఖర్, ఏలూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొమ్మని విజయ, అంగన్వాడి డ్వాక్రా మహిళ నాయకురాలు సయ్యద్ నజీమ్ మున్నిసా, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి గద్దె రఘుబాబు, మాజీ కౌన్సిలర్ పాదం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.