మట్టపర్తి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: తాళ్లరేవు మండలం, ఉప్పంగల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మట్టపర్తి సత్యనారాయణ కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం అని జనసేన పార్టీ తరపున హామీఇచ్చారు. వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వీరి వెంట తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, వంగా త్రిమూర్తులు, దూడల స్వామి, పెన్నాడ శివ, వంగా సీతారాం, సుందరంపల్లి సత్యనారాయణ, పంపన సూరిబాబు, కర్నీడి నాని, గెద్దాడ శ్రీను, గుత్తాల బాలకృష్ణ, దడాల చినబాబు, పితాని సత్యనారాయణ, చెల్లుబోయిన రాజు, మట్టపర్తి శ్రీను, మట్టపర్తి కృష్ణంరాజు, ముడికి క్రాంతికుమార్ మొదలగువారు పాల్గొన్నారు.