అంగన్వాడీల, ఆశావర్కర్ల సమ్మెకు జనసేన నాయకుల మద్దతు

  • అంగన్వాడీల, ఆశావర్కర్లు సమ్మెలో న్యాయం ఉంది. వాళ్ళ డిమాండ్స్ వెంటనే తీర్చండి
  • పుట్టుకలకు ముందుండి పెద్దమ్మ పాత్ర పోషిస్తున్న ఆశావర్కర్లుకు కనీస వేతనం ఇవ్వకపోవడం కచ్చితంగా వైసీపీ వైఫల్యమే.
  • తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీలకు వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానన్న పాదయాత్రలో హామీ ఇచ్చి మాటతప్పిన జగన్ రెడ్డి
  • అంగన్వాడీలకు, ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన 2253 కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించారు.
  • పార్వతీపురం జనసైనికులు అంగన్వాడీల, ఆశావర్కర్లు సమ్మెకు అండగా ఉండండి అని పిలుపునిచ్చిన ఆదాడ మోహన్ రావు

పార్వతీపురం నియోజకవర్గం: అంగన్వాడీల, ఆశావర్కర్లు పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ పార్వతీపురం నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ పార్వతీపురం సమన్వయకర్త ఆదాడ మోహన్, సీనియర్ నాయకులు చందక అనీల్, రాజానా రాంబాబు, మనేపళ్లి ప్రవీణ్, కడగల శ్యాంసుందర్, పైలా శ్రీను, రౌతు బాలు తదితర నాయకులు మద్దతు తెలిపిపారు. అనంతరం ఆదాడ మోహన్ గారు మాట్లాడుతు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు చేస్తున్న సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీలకు వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానన్న పాదయాత్రలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టకుండా అంగన్వాడి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అలాగే అంగన్వాడీలకు, ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన 2253 కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించారన్నారు. పుట్టుకలకు ముందుండి పెద్దమ్మ పాత్ర పోషిస్తున్న ఆశావర్కర్లుకు కనీస వేతనం ఇవ్వకపోవడం కచ్చితంగా వైసీపీ వైఫల్యమే. అంగన్వాడీ, ఆశావర్కర్లు ఉద్యోగులు చేస్తున్న నిరసనకు పార్వతీపురం నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బంది, ఒత్తుళ్ళు కలిగించిన  స్థానిక జనసేన పార్టీ నాయకులకు తెలియపరిచిన వెంటనే మా నాయకులు అంగన్వాడీ కార్యక్రమానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వం స్థాపించగానే మీ డిమాండ్స్ నెరవేరుస్తాం అని మాటిచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని అండగా నిలిచారు.