ఆశ వర్కర్ల, అంగన్వాడి టీచర్ల ధర్నాకు ఆదాడ మద్దతు

పార్వతిపురం: ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు చేసే ధర్నాకు మద్దతు తెలిపి సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్న పార్వతీపురం జనసేన పార్టీ సమన్వయకర్త ఆదాడ మొహన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి గర్భం నుండి ఉయ్యాల వరకు మీరు చేసిన సేవ అనే ఋణం తీర్చుకోలేనిది, అమ్మవడి నుండి బడి వరకు మీరు తల్లి స్థానంలో ఉండి నడిపించే విధానం మరువలేనిది. మీరు చేసే త్యాగం, ఋణం తీర్చుకునే అవకాశం వస్తే తీసుకుంటానని ఆదాడ మోహన్ రావు పేర్కొన్నారు. జగన్ మామ మాయలోడు నమ్మవద్దు ఈ ధర్నాలో పార్వతీపురం జనసేన నాయకులు చందక అనిల్, శ్రీనివాసరావు, దంతులూరి రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.