అధినేత స్పూర్తితో కౌలు రైతులకు అండగా అతికారి దినేష్

  • మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా అతికారి దినేష్
  • 20 మంది రైతులకు లక్షరూపాయల ఆర్ధికసాయం

రాజంపేట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తున్న రాజంపేట జనసేన పార్టీ సమన్వయ బాద్యులు అతికారి దినేష్. గత పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని పాటురు గ్రామంలో దాదాపు 20 మంది రైతులు 120 ఎకరాలలో వరి పంట పండించడం, చేతికి వచ్చిన పంట నీళ్ళపాలు కావడంతో నష్టపోయిన కౌలురైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా ఒక్కొక్క రైతుకు 5000 రూపాయల చొప్పున దాదాపు 20 మంది రైతన్నలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ గత పది రోజుల క్రితం మిచౌంగ్ తుఫాన్ కారణంగా రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాలలో వర్షపు నీరు చేరి వరి పంట వేసిన రైతులు భారీగా నష్టపోవడం అందులో భాగంగా నందలూరు మండలం, పాటూరు గ్రామంలోని రైతులు దాదాపుగా నూట ఇరవై ఎకరాలు చేతికి వచ్చిన పంట నష్టపోవడం, ఆ పంటలను ప్రత్యక్షంగా పరిశీలించిన మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున నష్టపోయిన 20 మంది రైతన్నలకు ఐదువేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి చిరు సహాయం చేసి మా వంతు రైతన్న కుటుంబాలకు అండగా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అన్నమయ్య డ్యాం తెగి వరదల కారణంగా నష్టపోయిన ఈ గ్రామ ప్రజలు మరొక్కసారి భారీ వర్షాల కారణంగా నష్టపోవడం ఈ ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడం కనీసం ఇప్పటికీ కూడా ప్రభుత్వం అధికారులు కానీ వైసీపీ నాయకులు గానీ ముఖ్యంగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి గాని ఇక్కడికి వచ్చి ఆ రైతులను పరామర్శించి వారికి ఏదన్న సహాయం చేయకపోవడం కనీసం వాళ్లను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్ల కోసం కనబడే రైతులు, ప్రజలు వారికి కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి కనపడకపోవడం సిగ్గుచేటు అని ఇప్పటికి కూడా ఈ రైతన్నలకు ఎటువంటి సహాయం చేయకపోవడం చాలా దౌర్భాగ్యమని ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు రైతన్నలు మహిళలు యువత ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని ఇంకో మూడు నెలల్లో జనసేన టిడిపి కూటమి ప్రభుత్వం వస్తుందని వచ్చిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతన్నను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాటురు గ్రామ టిడిపి అధ్యక్షులు ముమ్మడిశెట్టి రమేష్, ఉపాధ్యక్షులు కోటకొండ కృష్ణయ్య, వెంకటసుబ్బయ్య, జనసేన పార్టీ నాయకులు కుంచా శంకర్, నరేష్, కుంచా ముద్దల కృష్ణయ్య, సుబ్బు, మణి, చంద్రమౌళి, గుగ్గిళ్ళ నాగార్జున, కొండల గారి రవి, ఉపేంద్ర, మస్తాన్ రాయల్, గోపికృష్ణ, జనసేన మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.