అంగవైకల్యంతో ఉన్న వ్యక్తికి అండగా జనసేన నాయకులు

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, సోమవారం అడ్డతీగల మండలం ఉప్పలపాడు గ్రామంలో అంగవైకల్యంతో ఉన్న 12 సంవత్సరాల కుర్రోడు ఇంటిలో బాత్రూం లేక ఇబ్బంది పడుతున్నాడని తల్లిదండ్రులు ఎత్తుకుని ఆరు బయటికి తీసుకువెళ్లాలని జనసేన పార్టీ నాయకులకు వివరించడం జరిగింది. ఈ విషయం మీద స్పందించి రంపచోడవరం నియోజకవర్గం సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి బాత్రూం కట్టి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, కొణతం శ్రీనివాస్, పొడుగు సాయి, మణికంఠ, అప్పాజీ, వెంకన్న, వెంకటేష్, అంజి, రాజ్ కుమార్, బద్రి, వెంకటరమణ, గంగవరం మండలం సీనియర్ నాయకులు గణేష్, రాజేష్, చంద్రశేఖర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.