ఎస్.ఐ శివను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

ఉరవకొండ: బెళుగుప్ప మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.ఐ శివను బెళుగుప్ప పోలీస్ స్టేషన్లో మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్. అనంతరం ఎస్.ఐ శివకి శాలువా కప్పి, కరచాలనం చేసి స్వాగతం చెప్పారు. జనసేన పార్టీ పోలీసులకు ఎప్పుడు సహకరిస్తుంది అని ఎస్.ఐకు సుధీర్ తెలియజేశారు. వీరివెంట మండల నాయకులు రవినాయక్, తిప్పయ్య, అజయ్, మోహన్, త్రినీల్, తదితరులు ఉన్నారు.