అంగన్వాడీల నిరసన దీక్షకు మలిశెట్టి వెంకటరమణ సంఘీభావం

రాజంపేట: అంగన్ వాడిల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం రాజంపేట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో పదవ రోజు అంగన్వాడి వర్కర్లు ఆయాలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. పది రోజులుగా అంగన్వాడి వర్కర్లు సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వారికి కనీస వేతనం 26,000 ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే మీకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు జీతాలు పెంచకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వారి న్యాయమైన సమస్యల కోసం సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.