నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తాం

నందిగామ నియోజకవర్గం: జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఆదేశాలనుసారం నందిగామ మండలం, కమ్మవారిపాలెం గ్రామంలో మండల అధ్యక్షులు కె రామారావు పార్టీ సీనియర్ నాయకులు సూర సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో జనసైనికుల కార్యాచరణ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఏ రకంగా ముందుకు వెళ్లాలి నియోజకవర్గంలో జనసైనికులు ఏ రకంగా పాల్గొనాలి కమ్మవారిపాలెం గ్రామంలో జనసేన పార్టీ పట్టిస్థతకు ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, బూత్ కమిటీల గురించి, జనసైనికుల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిగామ మండల రూరల్ అధ్యక్షులు కె రామారావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు స్వరాసత్యనారాయణ, గ్రామ నాయకులు, పెసరవల్లి శ్రీనివాసరావు, కొమ్మినేని రాంబాబు కొమ్మి నేని కోటయ్య కొమ్మినేని కొండ, బొక్క రత్నం బాబు తదితరులు పాల్గొన్నారు.